సాహసానికి చైతన్య రెడీ...
నాగ చైతన్య నిన్నటి వరకు ప్రేమమ్ సినిమా విజయంతో ఆనందంలో ఉన్నాడు. ఇప్పుడు మరో విజయం అందుకోవాలని తహతహలాడుతున్నాడు. నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కి రెడీ ఐంది. ప్రేమమ్ కన్నా ముందే సాహసం శ్వాసగా సాగిపో షూటింగ్ కంప్లీట్ అయింది,కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది.ఇప్పుడు ఈ ఇబ్బందులు తొలగడంతో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం లో శింబు హీరోగా నటించాడు. ఇంతకు ముందు ఏమాయచేసావే కూడా తమిళ్ లో శింబునే హీరో. ఈ సినిమా కు డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహ్మాన్. ఈ మూవీ ఈ నెలలోనే 11వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చైతన్యకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి. అల్ ది బెస్ట్ చైతన్య.