Vivarana
రామ్ గాడికి ఒక చెడ్డ అలవాటు ఉంది.ఉరికనే కోపం వచ్చేస్తుంది. ఇంతకీ మీకు రామ్ ఎవరో చెప్పలేదు కదా ,రామ్ థర్డ్ క్లాస్ కుర్రాడు,రామ్ బాగా చదువుతాడు తెలివైన కుర్రాడు.కానీ కోపం వాళ్ళ అప్పుడప్పుడు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒకసారి వాళ్ళ స్కూల్ టీచర్ స్కూల్ లో పిల్లలందరికీ ఒక పని అప్పగించింది. ఇంటిదగ్గర నుండి ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి స్కూల్ లో పాతి వాటికీ నీరు పోసి పెంచాలి అని చెప్పింది. అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మొక్కలు తీసుకు వచ్చారు. కానీ రామ్ కి వాళ్ళ ఇంట్లో మొక్కలు లేవు ఏమి చెయ్యాలా అని ఆలోచించాడు అప్పుడు సడన్ గ వాడికి ఒక ఐడియా వచ్చింది.వాళ్ళ ఇంటికి కొంత దూరం లో కాలువ గట్టుదగ్గర ఇసుక ప్రాంతం ఉంధీ. అక్కడ ఎడారి మొక్కలు చాల ఉన్నాయ్. వాడి ఫ్రెండ్ శ్రీను గాడితో కలిసి వెళ్లి తెద్దామని శ్రీను కి చెప్పాడు.దానికి శ్రీను కూడా ఒకే అన్నాడు.ఇద్దరు మొక్కలు ఉన్న ప్లేస్ కి వెళ్లి ఒక మొక్క పీకారు. కానీ రామ్ అక్కడితో ఆగలేదు. చాల మొక్కలు పీకేసాడు. శ్రీను వద్దు ర ఇంకా చాలు అన్న వినలేదు సరికదా వాణ్ణి తిట్టాడు.శ్రీనుకి భాధ కలిగి ఇంకేమి మాట్లాడలేదు.రామ్ పీకిన మొక్కలన్నీ తెచ్చి స్కూల్ దగ్గర పాతారు. ఆ రోజు స్కూల్ లో టీచర్ రాలేదు సెలవు లో ఉన్నారు. మరుసటి రోజు టీచర్ అది చూసి వెంటనే ఆ మొక్కలు ఎవ్వరు పాతారు అని అక్కడ ఉన్న పిల్లాడిని అడిగితె రామ్,శ్రీను అని చెప్పాడు. టీచర్ వెంటనే కోపంతో రామ్ ని శ్రీను ని పిలిపించింది. ఇద్దర్ని టీచర్ చితక బాదింది. చాల గట్టిగ కొట్టింది. ఇద్దరు టీచర్ ఎందుకు కొడుతుందో తెలీక తెల్ల మొహాలు వేశారు. కొట్టాక టీచర్ వాళ్ళిద్దరిని క్లాస్ రూమ్ బయటనే నిలబెట్టింది. వాళ్ళు ఏడుస్తూ అలానే ఉండిపోయారు. కొద్దిసేపటికి టీచర్ కి జాలి వేసి క్లాస్ లోపలి పిలిచింది ఇద్దరినీ. మీరు ఎందుకు అన్ని మొక్కలు తెచ్చి పాతారు అని అడిగింది.దానికి శ్రీను నేను చెప్పాను టీచర్ కానీ రామ్ వినలేదు పైగా నామీద కోప్పడ్డాడు అని చెప్పాడు. అప్పుడు టీచర్ రామ్ ని ఎందుకు అన్ని మొక్కలు తెచ్చావ్ అని అడిగింది. దానికి రామ్ ఎక్కువ మొక్కలు పాతితే మెచ్చుకుంటారు అనుకున్నాను టీచర్ కానీ ఇలా కొడతారు అని అనుకోలేదు అని అమాయకంగా అన్నాడు. అప్పుడు టీచర్ మరి శ్రీను చెప్పిన వినకుండా ఎందుకు శ్రీను మీద కోప్పడ్డవా అని అడిగింది దానికి రామ్ దగ్గర సమాధానం లేదు. అప్పుడు టీచర్ ఇద్దరినీ కూర్చోపెట్టి వాళ్ళకి ఇలా చెప్పింది. మొక్కలు అన్ని ఒకేలా ఉండవు కొన్ని కొన్ని కొన్ని చోట్ల కొన్ని రకాల మొక్కలు మాత్రమే బ్రతుకుతాయి. మీరు తెచ్చిన ఈ మొక్కలు ఇసుక ప్రాంతాల్లో మాత్రమే బ్రతుకుతాయి. మీకు ఇంతకుముందే చెప్పను కదా మొక్కలకు ప్రాణం ఉంటుందని ఇప్పుడు చుడండి ఈ మొక్కలన్నీ చచ్చిపోతాయి మీ వాళ్ళ అందుకే కోపం వచ్చి కొట్టాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకండి,నేను చెప్పినట్లు ఒక్క మొక్క మాత్రమే తెస్తే ఒక మొక్కతోనే పోయేది ఇప్పుడు చుడండి ఎన్ని మొక్కలు పాడైపోయాయో అని టీచర్ వాళ్ళిద్దరికీ వివరంగా చెప్పింది.మొక్కలు గురించి చెట్ల గురించి చాల వివరంగా వాళ్ళకి అర్ధం అయ్యేలా మరోసారి చెప్పింది. అంతా చెప్పాక శ్రీను ని వెళ్ళమని చెప్పి రామ్ ని ఆపారు టీచర్. చూసావా రామ్ నీ వాళ్ళ ,నీ కోపం వల్ల ఈ రోజు శ్రీను నా చేతిలో దెబ్బలు తిన్నాడు. మన కోపం వాళ్ళ మనం నష్టపోయిన పర్లేదు,కానీ మనకి సహాయం చేసే వాళ్ళు ఇబ్బందుల్లో పడకూడదు అని చెప్పింది .ఆ మాటలు రామ్ కి బాగా అర్థమయ్యాయి. ఇంకెప్పుడు తనవల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నాడు.అంతే కాదు చెప్పిన పని చెప్పినట్లు చెయ్యాలి అతిగా చెయ్యకూడదు ఇతరులా మెప్పు కోసం అని తెలుసుకున్నాడు.శ్రీను కి సారీ చెప్పి ఇంటికి వెళ్లి తన చెల్లికి చెట్లు గురించి,చెట్ల విలువ గురించి టీచర్ పాఠాన్ని చెప్పాడు.ఆ రోజు నుండి కోపం కూడా తగ్గించుకున్నాడు.ఈ పాఠం నేర్చుకున్న రామ్ వాళ్ళ నాన్న ఖర్చు పెట్టుకోమని ఇచ్చిన డబ్బులతో సంతకి వెళ్లి టమోటా,బెండ,ఆనపకాయ కొన్ని రకాల విత్తనాలు కొని ఇంటిగగ్గర పోతాడు.వాటిని చాల జ్రాగర్తగా పెంచాడు వాళ్ళ తాతయ్య సలహాలు తీసుకుంటూ. కొన్నాళ్ళకి అవి కాయలు కాసాయి.వాటిని కోసి తీసుకుని వెళ్లి టీచర్ కి మొక్కల ఆవశ్యకత చెప్పినందుకు బహుమానం గ ఇచ్చాడు. టీచర్ చాలా చాలా ఆనందపడింది రామ్ చేసిన పనికి. రామ్ మొక్కలు పెంచిన విధానం అడిగి తెలుసుకుని పిల్లలు అందరికి రామ్ చేత ఎలా తాను మొక్కలు పెంచాడో అందరికి చెప్పించారు. పిల్లలందరూ రామ్ ని మెచ్చుకున్నారు.రామ్ చేసిన ఈ పనికి టీచర్ రామ్ కి ప్రత్యేకంగా గ ఒక బహుమానం కొని ఇచ్చారు.రామ్ దానిని తెరవకుండానే శ్రీను కి ఆ గిఫ్ట్ ఇచ్చి నావల్ల ఆరోజు నువ్వు దెబ్బలు తిన్నావు ఏమి సంబంధం లేకపోయినా కాబట్టి ఇప్పుడు ఇది నీకు అని ఇచ్చేసాడు. రామ్ చేసిన పనికి టీచర్ కి నోటా మాట రాలేదు.పిల్లలన్దరు చప్పట్లు కొట్టారు. టీచర్ మనస్సులో ఇలా అనుకుంది రామ్ ఒక్కడే కాదు ఆ రోజు నేను కూడా తప్పు చేశాను కొట్టకుండా కూడా నేను వాళ్ళకి చెప్పి ఉండొచ్చు,చిన్న హృదయాలు ఆ రోజు ఎంత విలవిలలాడిపోయాయో అనుకుని మనస్సులోనే వాళ్ళకి మనస్సులోనే సారీ చెప్పుకుంది. పార్టీ ఇంట్లోనూ ఒక రామ్ ఉంటాడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు తప్పు చేస్తే వివరంగా చెప్పండి. తప్పు చేస్తే కొట్టండి కానీ మీరు చెప్పే విధానం లోనే వాళ్ళ భవిష్యత్ ఉంటుంది.
superb story
ReplyDeleteNice story, I never seen in my life, your a great writer. Thanks
ReplyDelete