cell phone
రవి వయస్సు 15 సంవత్సరాలు.ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు.రవిది మధ్య తరగతి కుటుంబం.రవి వాళ్ళ నాన్న చిన్న దుకాణ వర్తకుడు.రవి కి టెక్నాలజీ అంటే అమితమైన ఆసక్తి .శంకర్,శివ మరియు నరేష్ రవి స్నేహితులు. వీరు నలుగురు ఎప్పుడు కలిసి స్కూల్ కి వెళ్తుంటారు. శంకర్,శివ కి వాళ్ళ ఇళ్లలో స్మార్ట్ ఫోన్స్ కొనిచ్చారు పిల్లలు పడవ తరగతి చదువుతున్నారు అని.నరేష్ కి సెల్ ఫోన్ ఇష్టం లేదు.నరేష్ ఇంట్లో కొనిస్తామని అన్న తీసుకోలేదు.శంకర్,శివాలని చూసి రవికి కూడా ఫోన్ కావాలన్నా కోరిక పెరిగింది దానికి తోడు ఫోన్ ఉంటె చాల చాల కొత్త విషయాలు తెలుసుకోవచ్చని కోరిక.రవి వాళ్ళ నాన్నని సెల్ ఫోన్ కొనివ్వమని అడిగాడు. దానికి వాళ్ళ నాన్న పడవ తరగతి ప్రధమ స్థానం లో పాస్ అయితే కొనిస్తానని చెప్పాడు.ఈ విషయం రవికి నచ్చలేదు. శివ అస్తమాను రవి దగ్గరికి తన ఫోన్ తీసుకొచ్చి పాటలు,సినిమాలు చూపించేవాడు. సెల్ ఫోన్ లేకపోతే లైఫ్ వేస్ట్ అనేలా మాట్లాడేవాడు. పదే పదే శివ ఇలా చెప్పడం వాళ్ళ రవికి సెల్ పిచ్చి పట్టుకుంది. ఎలాగైనా సరే సెల్ ఫోన్ కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం ముగ్గురి ఫ్రెండ్స్ కి చెప్పాడు వాళ్లలో నరేష్,శంకర్ కి ఈ విషయం నచ్చలేదు. ఇంట్లో కొనిస్తే తీసుకోవాలి తప్ప మనం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని రవి కి చెప్పాడు రవి ఇదంతా వినలేదు. శివ రవికి దొంగతనం చెయ్యమని సలహా ఇచ్చాడు. రవికి భయం వేసింది,కానీ ఫోన్ ఎలా ఐన కొనాలనే కోరికతో సరే అని దొంగతనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. బయట దొంగతనం చేస్తే దొరికిపోతే మల్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు అదే ఇంట్లో అయితే తెలియదు,తెలిసిన వదిలేస్తారు అని ఇంట్లోనే దొంగతనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.ఇదే విషయం ముగ్గురు ఫ్రెండ్స్ కి చెప్పాడు.శివ చాల ఆనందంగా అలానే చెయ్యి నేను చాల సార్లు చేశాను పర్లేదు అని ప్రోత్సహించాడు.నరేష్,శంకర్ మాత్రం వద్దురా ఇలా చేస్తే మనవాళ్ళు మనల్ని ఇంకెప్పుడు నమ్మరు మనల్ని,ఇది మంచి పద్ధతి కాదు అని చాల చాల చెప్పారు.శంకర్ అయితే పోనీ నా ఫోన్ తీసుకో పర్లేదు నేను ఇంట్లో నా ఫోన్ పోయిందని చెప్తాను అన్నాడు. దానికి రవి ఒప్పుకోలేదు నాకు సొంత ఫోన్ కావాలి ,ఏదేమైనా ఇవాళ డబ్బులు దొంగతనం చేసి మంచి ఫోన్ కొనుక్కుంటానని చెప్పాడు. ఎంత చెప్పిన వినకపోయేసరికి నరేష్,శంకర్ అక్కడి నుండి వెళ్లి పోయారు. శివ మాత్రం రవి కి నువ్వు దొంగతనం చెయ్యి ఏమి కాదులే అని నూరి పోసాడు.రవి ఆ రోజు ఇంటికి వెల్లి ఇంట్లో బీరువాలో ఉన్న పదివేలు రూపాయలు కట్ట తీసుకున్నాడు. శివ దగ్గరకి వెళ్లి డబ్బులు చూపించాడు.శివ చాల ఆనందపడి పద షాప్ కి వెళ్లి మంచి ఫోన్ కొందామని ఇద్దరు షాప్ కి వెళ్లి పదివేల రూపాయల స్మార్ట్ ఫోన్ కొన్నారు. రవి చాల ఆనందంగా ఆ ఫోన్ తీసుకుని ఫోన్ తో గేమ్స్ ఆడుకుంటున్నాడు శివతో కలిసి.ఇంతలో అటుగా రవి చెల్లి ఏడుస్తూ స్కూల్ నుండి వచ్చేయడం రవి చూసాడు ఏమైంది ఎందుకు స్కూల్ నుండి వచేస్తున్నావ్? ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాడు దానికి చెల్లి ఇవాళ నాన్న స్కూల్ లో ఫీజు కట్టలేదు అందుకే నన్ను స్కూల్ నుండి పంపేశారు అని చెప్పింది. దానితో ఒక్కసారిగా రవికి చెమటలు పట్టాయి.తనవల్ల చెల్లి స్కూల్ ఫీజు లేట్ అయిందని భయం పట్టుకుంది. చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు.ఇంటికి వెళ్ళేప్పటికీ పెద్ద గొడవ జరుగుతుంది అమ్మ,నాన్న ల మధ్య. డబ్బులు ఏమయ్యాయి అంటే ఏమయ్యాయి అని గొడవ. రవి కానీ తీసి ఉంటాడని అమ్మ నాన్నతో అంది. దానికి నాన్నకి కోపం వచ్చి రవి అలాంటివాడు కాదు అని అమ్మ ని చెంప మీద కొట్టాడు నీ అజ్రాగత్త వల్లే డబ్బులు పోయాయి అని తిట్టాడు. అది చూసి రవి కి ప్రాణం పోయినంత పని అయింది ఎప్పుడు నాన్న అమ్మని ఒక్క మాట జేకూడా అనడు ఈ రోజు తన వాళ్ళ అమ్మని కొట్టాడు మరియు గొడవ పడ్డారు అమ్మ నాన్న. చెల్లిని ఇంటిదగ్గర వదిలేసి సెల్ ఫోన్ షాప్ కి ఏడ్చుకుంటూ వెల్లి షాప్ ఓనర్ కి జరిగిందంతా చెప్పి ఫోన్ తీసుకుని డబ్బులు ఇప్పించమని బ్రతిమాలాడాడు మొదట్లో ఓనర్ ఒప్పుకోలేదు తరువాత రవి ఏడుపు చూసి జాలి వేసి డబ్బులు తిరిగి ఇప్పించాడు. డబ్బులు పట్టుకుని రవి ఇంటికి వెళ్లి అమ్మ నాన్నలకు జరిగిందంతా చెప్పి క్షమించమని బ్రతిమాలాడు.విషయం అర్ధమైన అమ్మ రవిని ఓదార్చింది కానీ నాన్న కు మాత్రం కోపం పోలేదు దానితో రవితో మాట్లాడటం మానేసాడు. రవి ఎంత బ్రతిమాలిన నాన్న పట్టించుకునే వాడు కాదు. రవి అమ్మతో ఈ విషయం చెప్పి బాధపడ్డాడు దానికి అమ్మ నువ్వు ముందు బాగా చదువుకో నాన్నకి కోపం తగ్గిపోద్దిలే కొన్ని రోజులకి అని చెప్పింది. రవి తాను చేసిన తప్పు వల్లే ఇలా నాన్న తనతో మాట్లాడటం లేదు అని రోజు బాధపడేవాడు. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి.రవికి వాళ్ళ నాన్న మాటలు గుర్తుకు వచ్చాయి.నువ్వు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే సెల్ ఫోన్ కొనిస్త అన్న మాటలు.దానిని బట్టి రవికి ఒక విషయం అర్ధం అయింది .నాన్నకి నేను బాగా చదువుకుంటే ఇష్టం అని. వెంటనే నిర్ణయించుకున్నాడు ఈ సారి ఎలా ఐన సరే స్కూల్ ఫస్ట్ రావాలని. బాగా చదవడం మొదలు పెట్టాడు. నాన్నతో ఎలా ఐన మాట్లాడాలి మాట్లాడాలంటే మంచి మర్క్స్ రావాలి. చాల బాగా చదివే వాడు.రవి లో మార్పు అమ్మ,నాన్న లకి అర్ధం ఐంది. శివ ఫోన్ పట్టుకో వచ్చిన పట్టించుకునే వాడు కాదు.శివ తనని చెడగొడుతున్నాడని పక్కన పెట్టేసాడు. రవి వాళ్ళ అమ్మ రవి పట్టుదల చూసి రవికి కావలసిన బుక్స్ అన్ని ఇచ్చింది. రవి చదువుకోవడం కోసం ఒక రూమ్ కాలి చేసి మంచి బల్బ్,ఫ్యాన్ పెట్టించి ఇచ్చింది. రవి,శంకర్,నరేష్ ఆ రూమ్ లో చాల సేపు చదువుకునేవారు. శివ మాత్రం నేను చదువుకోడానికి రాను బోర్ అనేవాడు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ముగ్గురు ఎగ్జామ్స్ బాగా రాసారు. ఎగ్జామ్స్ అయ్యిన తర్వాత రవి సెలవులకు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ నాన్న దుకాణం లో సహాయం చేసేవాడు. నాన్న కూడా కూడా రవిలో మార్పు చూసి మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టాడు. నెల తర్వాత రిజల్ట్స్ రోజు వచ్చింది. పిల్లలు నలుగురు కొంచెం టెన్షన్ పడుతున్నారు. రవి వాళ్ళ నాన్న ఉదయమే లేచి సిటీ కి వెళ్తున్న అని అమ్మకి చెప్పి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలీదు. రిజల్ట్స్ వచ్చాయి. నరేష్,శంకర్ పాస్ అయ్యారు. శివవి అయితే అన్ని సబ్జక్ట్స్ పోయాయి. రవికి మాథ్స్ సబ్జెక్టు ఫెయిల్ అయ్యింది.రవి ఏడుస్తూ ఉన్నాడు. శివ మాత్రం పర్లేదులే చాల బాగా చదివారు వాల్లే పాస్ అవ్వలేదు మనకేమైంది అనుకుని బాగానే ఉన్నాడు.ఈ లోపు సిటీ నుండి రవి వాళ్ళ నాన్న వచ్చాడు . రవిని చూసి రిజల్ట్స్ ఏమయ్యాయి అని అడిగాడు.రవికి ప్రాణం పోయినట్లు అయ్యింది. భయంతో వణికి పోతు ఒక సబ్జెక్టు పోయింది అని చెప్పాడు. నాన్న తన బాగ్ లోంచి ఒక గిఫ్ట్ ప్యాకెట్ తీసి రవికి ఇచ్చి ఓపెన్ చెయ్యమని చెప్పాడు. రవి దాన్ని ఓపెన్ చేస్తే అందుకో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ఉంది. రవి దానిని ఎందుకు నాన్న నేను పాస్ కాలేదు కదా అని అన్నాడు.దానికి నాన్న చిన్నగా నవ్వి ఇది నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయ్యావని కాదు నీలో వచ్చిన మార్పుకి అని చెప్పాడు.నువ్వు బాగా కష్టపడ్డావు,బాగా చదివావు. బాగా ప్రయత్నం చేసావు కష్టపడేవాడు ఎప్పటికైనా జీవితం లో విజయం సాధిస్తాడు.మల్లి ఎగ్జామ్స్ లో బాగా రాసి పాస్ అవ్వు అని చెప్పి దుకాణానికి వెళ్ళిపోయాడు. అమ్మ అదంతా చూసి రవికి ఇలా చెప్పింది రవి నువ్వంటే నాన్నకి చాల ఇష్టం నాన్న నీతో మాట్లాడకపోయినా రోజు నన్ను అడిగే వాడు రవి తిన్నాడా,రవి పడకున్నాడా,ఎలా ఉంటున్నాడు అని ప్రతి విషయం కనుక్కునే వారు మీ నాన్న. నీకు బుక్స్ కూడా కొనిచ్చింది నాన్నే అని చెప్పింది. దానితో రవికి ఒక్క సారి ఏడుపొచ్చేసింది. నాన్న తనతో మాట్లాడటం లేదు అనుకున్నాడు కానీ తనని తనకు తెలీకుండానే చాల జ్రాగర్తగా చూసుకుంటున్నాడని అర్ధం అయ్యింది .ఈ సారి భయం లేదు. నాన్న ఇచ్చిన దైర్యం ఉంది. ఇంకో నెలలో మల్లి సప్లమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి ఎలా అయినా పాస్ అవ్వాలి అని అనుకున్నాడు. నరేష్,శంకర్ లతో తనకు తెలియని లెక్కలు చెప్పించుకునే వాడు.నాన్న ఇచ్చిన మొబైల్ ని మంచిగా వాడుకున్నాడు.నెట్ లో తనకు కావాల్సిన మోడల్ పేపర్స్ చూసుకుని వాటిని ఈజీ గ ఎలా చెయ్యాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాడు.ఈ సారి కష్టపడటమే కాకుండా తెలివిగా ఈజీ గ మాథ్స్ ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు. ఎగ్జామ్స్ వచ్చాయి. రవి పరీక్ష ఈ సారి చాలా బాగా రాసాడు. ఒక నెల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి.మర్క్స్ చూసుకుని రవి ఆశ్ఛర్య పోయాడు .సంబరపడిపోతూ వెళ్లి నాన్నకు చూపించాడు తన మర్క్స్ .నాన్న చాల హ్యాపీ ఫీల్ అయ్యాడు.అదే రోజు రవి మాథ్స్ టీచర్ రవి వాళ్ళ ఇంటికి వచ్చి చాల ఆనందంగ ఉంది రవి ఇప్పటివరకు మన స్కూల్ లో ఒక్కరు కూడా నూటికి నూరు మర్క్స్ తెచ్చుకోలేదు.నువ్వు తెచ్చుకున్నావు అదికూడా సప్లిమెంటరీ ఎక్సమ్ లో వెరీ గుడ్ ఇలానే బాగా చదువు అని చెప్పి రవి వాళ్ళ నాన్నతో కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు. రవి వాళ్ళ నాన్న చాల చాల ఆనందపడ్డారు..ఎందుకంటే రవి వాళ్ళ టీచర్ నాన్నతో ఇలా చెప్పారు ఈ సారి ఇచ్చిన మాథ్స్ పేపర్ గత పది సంవత్సరాలలో ఇచ్చిన అన్ని పేపర్ ల కంటే చాల కష్టమైన పేపర్.సిలబస్ లో లేని ప్రశ్నలు కూడా వచ్చాయి. అలాంటి పేపర్ లో వందకు వంద రావడం అంటే చాల గ్రేట్ .మీ వాడు చాల గొప్పవాడు అవుతాడు అని టీచర్ చెప్పాడు.రవి ఫ్రెండ్స్ వచ్చి రవి కి కంగ్రాట్స్ చెప్పారు. ఇన్ని మర్క్స్ ఎలా వచ్చాయి అని అడిగారు. దానికి రవి మా నాన్న నన్ను నమ్మారు. .కష్టపడే కాదు ఇష్టపడి కూడా చదవమని చెప్పారు. నాకు ఇష్టమైన టెక్నాలజీ తో ఇంకా ఇష్టంగా మాథ్స్ నేర్చుకున్నాను అని చెప్పాడు. రవికి వచ్చిన మర్క్స్ తెలుసుకుని సిటీ లోని మంచి ఇంటర్ కాలేజీ లో రవిని ఫ్రీగా జాయిన్ చేసుకున్నారు. రవి వాల్ల ఫామిలీ హ్యాపీ ,రవి హ్యాపి .....
చూసారా పిల్లలు ఈ కథలో నీతి ఏమిటంటే దొంగతనం చెయ్యకూడదు. అమ్మ,నాన్నని బాధ పెట్టకూడదు. కష్టపడే కాదు ఇష్టపడి అర్ధం చేసుకుని చదవాలి.
చూసారా పిల్లలు ఈ కథలో నీతి ఏమిటంటే దొంగతనం చెయ్యకూడదు. అమ్మ,నాన్నని బాధ పెట్టకూడదు. కష్టపడే కాదు ఇష్టపడి అర్ధం చేసుకుని చదవాలి.
very good story
ReplyDelete