Posts

cell phone

రవి వయస్సు 15 సంవత్సరాలు.ప్రభుత్వ పాఠశాలలో పదవ  తరగతి చదువుతున్నాడు.రవిది మధ్య తరగతి కుటుంబం.రవి వాళ్ళ నాన్న చిన్న దుకాణ వర్తకుడు.రవి కి టెక్నాలజీ అంటే అమితమైన ఆసక్తి .శంకర్,శివ మరియు నరేష్ రవి స్నేహితులు. వీరు నలుగురు ఎప్పుడు కలిసి స్కూల్ కి వెళ్తుంటారు. శంకర్,శివ కి వాళ్ళ ఇళ్లలో స్మార్ట్ ఫోన్స్ కొనిచ్చారు పిల్లలు పడవ తరగతి చదువుతున్నారు అని.నరేష్ కి సెల్ ఫోన్ ఇష్టం లేదు.నరేష్ ఇంట్లో కొనిస్తామని అన్న తీసుకోలేదు.శంకర్,శివాలని చూసి రవికి కూడా ఫోన్ కావాలన్నా కోరిక పెరిగింది దానికి తోడు ఫోన్ ఉంటె చాల చాల కొత్త విషయాలు తెలుసుకోవచ్చని కోరిక.రవి వాళ్ళ నాన్నని సెల్ ఫోన్ కొనివ్వమని అడిగాడు. దానికి వాళ్ళ నాన్న పడవ తరగతి ప్రధమ స్థానం లో పాస్ అయితే కొనిస్తానని చెప్పాడు.ఈ విషయం రవికి నచ్చలేదు. శివ అస్తమాను రవి దగ్గరికి తన ఫోన్ తీసుకొచ్చి పాటలు,సినిమాలు చూపించేవాడు. సెల్ ఫోన్ లేకపోతే లైఫ్ వేస్ట్ అనేలా మాట్లాడేవాడు. పదే పదే శివ ఇలా చెప్పడం వాళ్ళ రవికి సెల్ పిచ్చి పట్టుకుంది. ఎలాగైనా సరే సెల్ ఫోన్ కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం ముగ్గురి ఫ్రెండ్స్ కి చెప్పాడు వాళ్లలో నరేష్,శంకర్...

Vivarana

రామ్ గాడికి ఒక చెడ్డ అలవాటు ఉంది.ఉరికనే  కోపం వచ్చేస్తుంది. ఇంతకీ మీకు రామ్ ఎవరో చెప్పలేదు కదా ,రామ్ థర్డ్ క్లాస్ కుర్రాడు,రామ్ బాగా చదువుతాడు తెలివైన కుర్రాడు.కానీ కోపం వాళ్ళ అప్పుడప్పుడు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒకసారి వాళ్ళ స్కూల్ టీచర్ స్కూల్ లో పిల్లలందరికీ ఒక పని అప్పగించింది. ఇంటిదగ్గర నుండి ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి స్కూల్ లో పాతి వాటికీ నీరు పోసి పెంచాలి అని చెప్పింది. అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మొక్కలు తీసుకు వచ్చారు. కానీ రామ్ కి వాళ్ళ ఇంట్లో మొక్కలు లేవు ఏమి చెయ్యాలా అని ఆలోచించాడు అప్పుడు సడన్ గ వాడికి ఒక ఐడియా వచ్చింది.వాళ్ళ ఇంటికి కొంత దూరం లో కాలువ గట్టుదగ్గర ఇసుక ప్రాంతం ఉంధీ. అక్కడ ఎడారి మొక్కలు చాల ఉన్నాయ్. వాడి ఫ్రెండ్ శ్రీను గాడితో కలిసి వెళ్లి తెద్దామని శ్రీను కి చెప్పాడు.దానికి శ్రీను కూడా ఒకే అన్నాడు.ఇద్దరు మొక్కలు ఉన్న ప్లేస్ కి వెళ్లి ఒక మొక్క పీకారు. కానీ రామ్ అక్కడితో ఆగలేదు. చాల మొక్కలు పీకేసాడు. శ్రీను వద్దు ర ఇంకా చాలు అన్న వినలేదు సరికదా వాణ్ణి తిట్టాడు.శ్రీనుకి భాధ  కలిగి ఇంకేమి మాట్లాడలేదు.రామ్ పీకిన మొక్కలన్నీ తెచ్...

యువరాజ్ మళ్ళీ అరిపించాడు ...

Image
యువరాజ్ మళ్ళీ  అదరగొట్టేసాడు. ఇక్కడ హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఉత్తర్ ప్రదేశ్ తో పంజాబ్ తలపడుతుంది. ఈ రంజీ ట్రోఫీలో యువరాజ్ మరోసారి తన బాటింగ్ లో మెరుపులు మెరిపించాడు.  ఈ మ్యాచ్ లో యువరాజ్ 85 పరుగులు (130 బంతుల్లో ) చేసాడు. పంజాబ్ తోలి ఇన్నింగ్స్ లో 319 పరుగులు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ తోలి ఇన్నింగ్స్ లో 335 పరుగులు చేసింది .ఇప్పటివరకు ఆట 3 రోజులు ముగిసింది.  

సాహసానికి చైతన్య రెడీ...

Image
నాగ చైతన్య నిన్నటి వరకు ప్రేమమ్ సినిమా విజయంతో ఆనందంలో ఉన్నాడు. ఇప్పుడు మరో విజయం అందుకోవాలని తహతహలాడుతున్నాడు.  నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కి రెడీ ఐంది. ప్రేమమ్ కన్నా ముందే సాహసం శ్వాసగా సాగిపో షూటింగ్ కంప్లీట్ అయింది,కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది.ఇప్పుడు ఈ ఇబ్బందులు తొలగడంతో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం లో శింబు హీరోగా నటించాడు. ఇంతకు ముందు ఏమాయచేసావే కూడా తమిళ్ లో శింబునే హీరో. ఈ సినిమా కు డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహ్మాన్. ఈ మూవీ ఈ నెలలోనే 11వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చైతన్యకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి. అల్ ది బెస్ట్ చైతన్య.

రెడిమి 4 సూన్ ...

Image
స్మార్ట్ ఫోన్స్ లో మనకు తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్ తో లభించే ఫోన్స్ లో చైనా ఫోన్ల తయారీ సంస్థ షియోమీ .ఇప్పుడు షియోమీ స్పీడ్ పెంచింది .రెడీమి మోడల్స్ లో భాగంగా ఇప్పుడు ఈ సంస్థ కొత్తగా రెడీమి 4 ను రిలీజ్ చేయడానికి సిద్ధం గ ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో రెడీమి 3 మోడల్ నడుస్తుంది .రెడిమి 3 మొబైల్ కి రెడీమి 4 అప్గ్రేడెడ్ వెర్షన్. ఈ మొబైల్ ను నవంబర్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి . ఈ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండబోతున్నాయి . 13ఎంపీ బ్యాక్ కెమెరా విత్ ఫ్లాష్ . 5ఎంపీ ఫ్రంట్ కెమెరా . 4100 బాటరీ కెపాసిటీ . 5 ఇంచెస్ స్క్రీన్ ,1,4 ఆక్టా ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ .ఈ ఫోన్ ధర 7000 రూపాయల వరకు ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. ఇంకా షియోమీ కంపెనీ నుండి అధికారక ప్రకటన అందలేదు. ఇప్పటినుంచే ఈ ఫోన్ కోసం స్మార్ట్ ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

డబల్ సెంచరీ తో యువరాజ్ విరుచుకుపడ్డాడు

Image
యువరాజ్ సింగ్ అదరగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ లో బరోడా పై యువరాజ్ విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ లో యువి 370 బాల్స్ లో 260 రన్స్ చేసాడు. ముందు రోజు అట ముగిసే సమయానికి యువరాజ్ 179 రన్స్ తో నాటౌట్ గ నిలిచాడు .ఈ రోజు అదే ఊపుతో డబల్ సెంచరీ సాధించాడు . పంజాబ్ తోలి ఇన్నింగ్స్ లో 670 పరుగులు చేసింది . బరోడా తన రెండో ఇన్నింగ్స్ లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి 37 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ ను డ్రా చేసింది. బరోడా తోలి ఇన్గ్స్ లో 529 పరుగులు చేసింది. ఆ ఇన్నింగ్స్ లో దీపక్ హుడా 293 పరుగులు చేసాడు.